show video detail
V6 Bathukamma Song 2019 || V6 Exclusive
- Published_at:2019-09-26
- Category:Music
- Channel:V6 News Telugu
- tags: bathukamma songs bathukamma v6 bathukamma song bathukamma Video songs v6 bathukamma song 2019 v6 bathukamma song 2018 v6 bathukamma song 2017 v6 bathukamma song 2016 telangana bathukamma songs Jennifer Alphonsse Goreti Venkanna Karthik Kodakandla telangana happyvijayadashami
- description: V6 News Presents Exclusive #Bathukamma Song 2019 for V6 News lovers Watch it and enjoy. Bathukamma is floral festival celebrated predominantly in #Telangana State and in some parts of Andhra Pradesh. Every year Bathukamma #festival is celebrated as per Shathavahana calendar for nine days starting Bhadrapada Pournami. Bathukamma represents cultural spirit of Telangana. Lyrics: Goreti Venkanna Music: Karthik Kodakandla Singers: Karthik Kodakandla, Sindhuja srinivasan, Nutana Mohan Kamala Director: Jennifer Alphonsse DOP: Suryaa Editor: S Ravikumar Choreography: Eeshwar Asst. Director: Allam Nag Production: VIL Media PVT LTD(V6 News) :: LYRICS :: పల్లవి: – ఊరూ... ఊరే పూలడొంక పారె వాగే సంద్రవంక పాల జొన్నా... తేనెలొలక పా...ల పిట్టా... వాలి కులుకా ఓ... రివ్యూ... రివ్యున తిరిగేగిరక జామ... కొరికే రామచిలుక నేలా... సూవులు నింగివంక ఎగిరిదూకే... వాన జింకా... ఓహో... హో.హో.హో చరణం:– 1 ఈ.. ఇసుకమేటలు ఊరుతున్న... ఆ జాలు ఊటలు ఏటి పరుగులో అలలు ఆటలు... నింగిలోన ఎన్నేల నవ్వులు సెరువులోన ఆ కలువపువ్వులు సందేవేల సిందాడె మువ్వలు వాన ఋతువు సీమంత మాడెనే... సెట్టు సేమలే... తేనెలూరెనే పుట్టింనింటి ఆ పట్టు కాంతులా పాలపుంత దిగి నేలకొచ్చెనే.. గాలి ఈల తాకి గంగ..పొంగేనే... ఇల పూల గోపురాల అలరించె రాగమాల అరచేతులాట జూడా... ఊరంత గుంపుగూడా అలనింగి సులువరేలా.. పయనించె పండవ లీలా.. దివినుంచి నేలవైపు..తన నడకనేమో.. ఊ...ఊ... చరణం 2:– పొన్నంగి సెన్నంగి పూరేడు బెడగువ్వ పల్లంకి తీతూక గొరవంకా... రంగుపిట్టలెన్ని రాసిగవచ్చినా పాలపిట్టకై.. పల్లె పబ్బతి పట్టే సేమంతి, పూబంతి కామంతి రుద్రాక్ష, గురవింద గునుగూలు అరవిందలూ... గందాలు గుప్పేట అందాలపూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంటా... ఓహో... హో.హో.హో. మా... మాగాని మడులల్ల... ఊ... ఊగేటి సేలల్ల... పాలకుంకలంటా... మా కంటి పాపలంటా... నే..ల దీపకాంతులు... పూ..ల పల్లె ఇంతులు... మెరుపుతీగలోలే...మరి మురిపెమొంపినారే... నేల నిండుగ..పూల పండుగా నీలికొండకే మెరుపులద్దెనే... పూలపల్లకి మేననెక్కి గౌరమ్మ సెరువులో కొలువుదీరినే... పూలవెలుగు నేలకాసి పగలాయే... యే... పూలెల్ల రాసులాయె.. గాలెల్ల గందమాయె.. తాలాల దరువులాయే... తప్పెట్ల మోతలాయే... పాటెంత ప్రాణమాయె పల్లంత గానమాయే... దివినేలయాకమాయే... భువి పూలజాతరాయే... ఓహో... హో. హో. హో. ఇయ్యాలో.. ఇయ్యాల ఓహో.. హో. హో. హో. ఇయ్యాలో... ఇయ్యాలో... పల్లవి 2:- ఇసుకల పెట్టేను గౌరమ్మా... ఇసుకలె పెరిగెనె గౌరమ్మా... ఇసుకలె వసంతమాడంగా... సూరీడా.. గౌరమ్మా... ఇరిగిన తిరుపతి మావిళ్ళు... పున్నా... గాంటి తాళ్ళు.. బోగలవంటి వనమూలు... వనములు సినుకులు గలగల పలికితే వనమంతా కదిలే... గౌరీ... మేడంతా కదిలే... వనమంతా కదిలే... గౌరీ... మేడంతా కదిలే... వనమంతా కదిలే... గౌరీ... మేడంతా... కదిలే... పసుపుల పుట్టేను గౌరమ్మా... పుసుపులె పెరిగెనె గౌరమ్మా... పసుపులె వసంతమాడంగా... సూరీడా... గౌరమ్మా... ఇరిగిన తిరుపతి మావిళ్ళు... పున్నా... గాంటి తాళ్ళు బోగలవంటి వనమూలు... వనములు సినుకులు గలగల పలికితే వనమంతా కదిలే... గౌరీ... మేడంతా కదిలే... వనమంతా కదిలే... గౌరీ... మేడంతా కదిలే... వనమంతా కదిలే... గౌరీ... మేడంతా కదిలే... స.. రీ... మా... గా... నీసా... సానీసా... ► Subscribe to V6 News Telugu : Youtube at http://goo.gl/t2pFrq ► Like us on Facebook : http://www.facebook.com/V6News.tv ► Follow us on Instagram : https://www.instagram.com/v6newstelugu/ ► Follow us on Twitter : https://twitter.com/V6News ► Visit Website : http://www.v6velugu.com/ ► Join Us On Telegram : https://t.me/V6TeluguNews
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2019-09-28 | 987,721 | 14,528 | 550 | (,#29) |